Tuesday, December 28, 2010

hi






పెయింట్ పూసాడు.. మొన్న జరీనా నోట్ బుక్ చిన్చేసాడు.. అంతకు ముందు షర్ట్ విప్పేసి నేల మీద పడుకున్నాడు.. క్లాస్ అయ్యేవరకూ నిన్చోపెడతా అంటే రైట్ సైడ్ నా లెఫ్ట్ సైడ్ నిన్చోనా అన్నాడు.. అస్సలు భయం లేదు.. మొన్న బోర్డ్ మీద యాపిల్ అని అందంగా రాయమంటే అరగంట A చెరిపి రాస్తూనే ఉన్నాడు.. ఎందుకురా అలా చెరుపుతావు అంటే అది అందంగా రావడం లేదు ..వచ్చేవరకూ అలా చేరుపుతా అన్నాడు..ఇలా ఒకటా ..





మొత్తుకున్నా కొసరి కొసరి తినిపిస్తూ.. అసలు మీ అబ్బాయి ఏం చేసాడో తెలుసా ..నిన్న వాడి ఫ్రెండ్ తూజా గాడితో కలిసి గోడల నిండా పెయింట్ పూసాడు.. మొన్న జరీనా నోట్ బుక్ చిన్చేసాడు.. అంతకు ముందు షర్ట్ విప్పేసి నేల మీద పడుకున్నాడు.. క్లాస్ అయ్యేవరకూ నిన్చోపెడతా అంటే రైట్ సైడ్ నా లెఫ్ట్ సైడ్ నిన్చోనా అన్నాడు.. అస్సలు భయం లేదు.. మొన్న బోర్డ్ మీద యాపిల్ అని అందంగా రాయమంటే అరగంట A చెరిపి రాస్తూనే ఉన్నాడు.. ఎందుకురా అలా చెరుపుతావు అంటే అది అందంగా రావడం లేదు ..వచ్చేవరకూ అలా చేరుపుతా అన్నాడు..ఇలా ఒకటా ..రెండా... ఇంటి కొచ్చి డబ్బాడు అమృతాంజన్.. సీసాడు నవరత్న కేశ తైలం తలకు రాస్తే గాని ఆ సంఘటన ఎఫ్ఫెక్ట్ తగ్గ లేదు నాకు..

ఇక మా అమ్మాయి చక్కగా ఇంగ్లిష్, తెలుగు మాట్లాడుతుందా.. వీడిది సంకర జాతి బాష ..అంటే సింగ్లీష్ అనుకునేరు..ఎక్కువగా ఫ్రెండ్స్ తో ఇంగ్లిష్ లో మాట్లాడి మాట్లాడి ఇంట్లో కన్ప్యూజ్ అయిపోతూ ఉంటాడు.. మమ్మీ , ఇఫ్ నేను లంచ్ ఈట్ చేస్తే నువ్వు నాకు టూ బొమ్మలు బయ్ చేస్తావా? మమ్మీ నీ స్టమక్ నుండి నేను ఎప్పుడు బోర్న్ అయ్యాను..ఇలా అన్నమాట.. ఒరేయ్ నాయనా మనకసలే భాషా పరిజ్ఞానం మెండు.. నువ్వు పూర్తిగా మున్చేయకురా అని వేడుకున్తూనే ఉంటాను రోజు ..


అదేంటో మా అమ్మాయికి నేను చెప్పే కధలన్నా ,జోల పాటలన్నా ఎంత ఇష్టమో వీడికి అస్సలు నచ్చదు.. వీడికి మూడేళ్ళ వయసులో నిద్ర పోతాడని జోల పాట పాడుతుంటే .. అమ్మా ఆ పాట ఆపితే నేను నిద్రపోతాను అని విసుక్కున్న ఘనుడు వాడు.. అక్కడితో ఊరుకుంటాడా..ఒక్కోసారి వాడికి నిద్రపోయే ముందు కధ చెప్పే మూడ్ వస్తుంది..వెంటనే నేను కధ చెప్తా అంటాడు..ఆ దెబ్బతో మా అమ్మాయి ప్రక్క బెడ్ రూం లోకి ,మా ఆయన హాల్లోకి పారిపోతారు ... ఇక ఆ అంతం లేని కధ అలా సాగుతూనే ఉంటుంది... అది రాత్రి పన్నెండు అవ్వచ్చు ఒంటిగంట అవ్వచ్చ్చు మన అదృష్టం మరీ పండితే తెల్లవారు జాము ౩ అవ్వచ్చు ... అలా చెప్పుతూనే ఉంటాడు.. మధ్య మధ్యలో వాడికి డౌట్ వచ్చినప్పుడల్లా ప్రశ్నోత్తర కార్యక్రమాలు నిర్వహిస్తాడు ... నేను గాని సరిగ్గా సమాధానం చెప్పలేదో ఇక కొంప కీకీకారణ్యం మే ....



..





పైగా వీడికి తెలివి తేటలు అపారం.. ఓ మారు సీరియస్ గా వచ్చి అమ్మా డేనియల్ వాళ్ళ డాడీ డేనియల్ కి ఒక psp వాళ్ళ అక్క కి ఒక psp ,రియాన్ కి ఒక psp కొన్నారు తెలుసా అన్నాడు.. అది బోలెడు ఖరీదు ..మన దగ్గర అంత డబ్బు లేదు .. ..తప్పు నువ్వు అలాంటివి అడగకూడదు అన్నాను..అప్పటికి వాడు సైలెంట్ అయ్యేసరికి శభాష్ అని నన్ను నేను తెగ మేచ్చేసుకున్నానా.. సాయంత్రం మా ఆయన ౪౦౦$ పెట్టి కొన్న psp తో